వరుస లొంగుబాటు ల నేపథ్యంలో ఛత్తీస్ ఘడ్ లో బుధవారం భారీ ఎన్ కౌంటర్ జరిగింది ఈ సారి భద్రతా బలగాలకు సైతం ఎదురు దెబ్బ తగిలింది 12 మంది నక్సల్స్ తో పాటు ముగ్గురు పోలీసులు సైతం మృతి చెందారు బీజాపూర్ జిల్లాలోని గంగుళూరు పోలీసు స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
డీఆర్జీ కి చెందిన ముగ్గురు జవాన్లు మృతి చెందగా ఇద్దరు డీఆర్జీ జవాన్లు గాయపడ్డారు
ఈ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్ తెలిపారు*
