నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోగల పలు బేకరీలో మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హైమద్ బజార్ లో గల పలు ప్రాంతాల్లో తయారుచేసే కేంద్రాల్లో మున్సిపల్ సిబ్బంది తనిఖీలు చేసి పలు బేకరీలకు జరిమానా విధించినట్లు తెలిపారు.
మొత్తం 5000 రూపాయలు జరిమానా రూపంలో వసూలు చేయడం జరిగింది. ఈ తనిఖీలో మున్సిపల్ సానిటరీ సూపర్వైజర్ సాజిద్ అలీ మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ మహిపాల్, జవాన్లు పాల్గొన్నారు.
