HomeTelanganaNizamabadఅంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ అవమానిస్తుంది..జిల్లా కాంగ్రెస్ భవనంలో అంబేద్కర్ కు ఘన నివాళి..డీసీసీ అధ్యక్షుడు...

అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని బీజేపీ అవమానిస్తుంది..జిల్లా కాంగ్రెస్ భవనంలో అంబేద్కర్ కు ఘన నివాళి..డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ ప్రజలకు స్వేచ,స్వాతంత్రపు హక్కులు కల్పించారు.కానీ దానిని బీజేపీ ప్రభుత్వం అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తుందనీ డీసీసీ అధ్యక్షుడు నగేష్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ భవన్ నందు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ 69 వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించారు.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఆ మహనీయునికి నివాళులు అర్పించారు. అనంతరం పులాంగ్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన తర్వాత నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ రాజ్యాంగ పీఠిక ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మాట్లాడుతూ…ప్రజలకు ఆయన ఇచ్చిన హక్కులను కాలరస్తుందనీ విమర్శించారు. అంబేడ్కర్ ని పేరును కనుమరుగు చేసే విధంగా బీజేపీ ప్రయత్నిస్తుందనీ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడుతూ సంవిధాన బచావో కారక్రమాలు నిర్వహిస్తున్నారు.

రాజ్యాంగాన్ని,రాజ్యాంగం ప్రజలకు ఇచ్చిన హక్కులను కాపాడటం కాంగ్రెస్ పార్టీ బాధ్యత అని అన్నారు. అంబేడ్కర్ దేశంలో అంటరానితం,కుల వివక్ష నిర్మూలన కొరకు ఎంతో కృషి చేసిన వ్యక్తి అని అన్నారు. దేశంలో అన్ని మతాలు, తెగలు, దళితులు, గిరిజనులు, వెనుకబడిన కులాలు తదితర వర్గాలకు సమ న్యాయం జరిగేలా, వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు, సర్వసత్తాక సౌర్వభౌమాధికారాన్ని దక్కించుకొనేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యంగాన్ని రూపొందించారన్నారు.

విద్య, న్యాయం, సామాజిక అభ్యున్నతి కోసం ఆయన నిరంతరం పోరాడారను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి,నూడ చైర్మన్ కేశ వేణు,డిసిసిబి చైర్మన్ రమేష్ రెడ్డి,గ్రంథాలయ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,సీనియర్ నాయకులు భక్తవత్సలం, రాష్ట్ర ఎన్ఎస్ యూఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments