Thursday, April 16, 2026
HomeCRIMEనగరంలో భారీ అగ్ని ప్రమాదం..

నగరంలో భారీ అగ్ని ప్రమాదం..

​ నగరంలోని ఓ పేపర్​ప్లేట్స్​ దుకాణంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అగ్నిమాపక శాఖ స్టేషన్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం…నగరంలోని వినాయక్ నగర్ లోని భవానీ పేపర్ ప్లేట్స్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

దీంతో షాప్లో ఉన్న పేపర్ ప్లేట్లు, ఇతర వస్తువులు తగలబడిపోయాయి. వెంటనే స్పందించిన యజమాని, స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

షార్ట్సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు అనుమానిస్తున్నారు.ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!