HomeCRIMEపండక్కి పందెం కోళ్లు రెడీ .... గుట్టుగా సాగుతున్న ఏర్పాట్లు .....కత్తుల యుద్దంకు సిద్ధం అవుతున్న...

పండక్కి పందెం కోళ్లు రెడీ …. గుట్టుగా సాగుతున్న ఏర్పాట్లు …..కత్తుల యుద్దంకు సిద్ధం అవుతున్న కోళ్లు ….రంగంలోకి పోలీసులు …..

పండక్కి పందెం కోళ్లు సిద్ధం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఇందుకోసం గుట్టుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. కత్తులతో యుద్ధం చెయ్యడానికి కోళ్లు ను పెంచుతున్నారు.ప్రతియేటా సాగే ఈ కోళ్ల పందేలకు పోలీసు ఆంక్షలు అనివార్యమే అయినా సరే పందెం రాయుళ్ల వ్యాపకం మాత్రం తగ్గడం లేదు.

ప్రతియేటా సంక్రాంతి పండగ కు వారం రోజుల ముందు తర్వాత జిల్లాలో ఆయా ప్రాంతాల్లో కోళ్ల పందాలు గుట్టుగా సాగుతుంటాయి స్థానిక పోలీసులు సైతం ఒకటి రెండు రోజులు చూసి చూడనట్లుగా వుంటారు కానీ బెట్టింగ్ దందా తరహా లో సాగే కేంద్రాల మీదే దాడులు చేస్తారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఇదో వేలం వెర్రిలాగా సాగేది కానీ తెలంగాణ వచ్చాక పండగ కి ఏపీ నుంచి ఇక్కడికి వారి బంధువుల రాకపోకలు కొంత తగ్గాయి. సంక్రాతి పండగ సంబరాలు చేసుకోవడానికి ఏపీ కి వెళ్లలేని వారు స్థానికంగానే పండగసంబరాలు చేసుకుంటున్నారు. అదీగాక జీవనోపాధి కోసం వచ్చిన వారు సైతం పండగ కోసం ఏపీ లో సొంతూళ్లకు వెళ్లలేని వారంతా ఇక్కడే ఉండి ధూమ్ ధామ్ గా పండగ చేస్తున్నారు సంక్రాంతి పండగ అంటేనే కోళ్ల పందేల కు ప్రతీక కదా అందుకే ఇక్కడ కూడా కోళ్ల పందేల సైతం నిర్వహించడానికి నిర్వాహుకులు గుట్టుగా ఏర్పాట్లు చేస్తుంటారు.

భారీఎత్తుగా నగదు చేతులు మారుతుంది. ఇందుకోసం ఏపీ నుంచి ప్రత్యేక పెంచిన కోళ్ళ ను సైతం తీసుకోస్తున్నారు. పందెం కోళ్లు వాటి కాళ్ళ కు తొడిగే కత్తులను గుట్టుగా జిల్లాలో ని ఆయా ప్రాంతాలకు ఈపాటికే తరలించారు. కోళ్ల పందేల్లో పాల్గొనే వారికి ఏపీ నుంచి పందెం కోళ్ల ను సైతం తెచ్చి ఇస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో బీర్కూర్ పిట్లం కోటగిరి వర్ని ఎడ్ పల్లి రెంజల్ ప్రాంతాల్లో ప్రతియేటా సంక్రాంతి పండగ రోజుల్లో కోళ్ల పందేలు యదేచ్చగా సాగుతుంటాయి. రాజకీయ ఒత్తిళ్ల తో ఒకటి రెండు రోజులు లైట్ తీసుకోని పోలీసులు అదే పనిగా భారీ స్థాయి లో బెట్టింగ్ లతో సాగె అడ్డాల మీద మాత్రం దాడులు చేస్తారు.

కానీ కోళ్ల పందేల ను పండగ సంబరాలకోసం కాకుండా బెట్టింగ్ తరహా లో సాగితే కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు సమాయత్తం అవుతున్నారు పండగ కు ఇంకా 20 రోజుల గడువు ఉన్న నేపథ్యంలో పందెం కోళ్ల అడ్డాల మీద పోలీసులు ఫోకస్ పెట్టారు బోధన్ పట్టణం సాయిదుర్గా కాలనీ లో సాయిబాబా అనే వ్యక్తి యొక్క ఇంటిలో సమాచారం మేరకు సీసీఎస్ టీమ్ , ఎస్‌ఐ మనోజ్ అద్వర్యం లో రైడ్ చేయగా సక్రాంతి పండుగకు పందెం ఆడించటానికి సిద్దంగా ఉన్న మూడు కోళ్ల తో పాటు ఆ కోళ్ల కాళ్ళ కు కట్టే 250 కత్తులు సైతం స్వాదీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments