నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నిర్వహించిన షటిల్ బ్యాట్మెంటల్ పోటీలు శనివారం విజయవంతంగా ముగిసాయి. మొదట షటిల్ బ్యాట్మెంటల్ పోటీలను నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్ వాగ్మారే, సీనియర్ జర్నలిస్టు, యువజన సంఘాల అధ్యక్షులు బొబ్బిలి నరసయ్య లు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో జర్నలిస్టులు ఎన్నో ఒత్తిడిలకు గురవుతారని, దాని నుంచి ఉపశమనం పొందడంతో పాటు ఉ ల్లాసాన్ని పొందుకోవాలంటే క్రీడలు ఎంతో దోహదపడతాయన్నారు.
విధి నిర్వహణలో ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ జర్నలిస్టులంతా ఈ విధంగా క్రీడా పోటీలు నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ క్రీడల ప్రాతినిధ్యాలను డాక్టర్లు, అడ్వకేట్లు ఇతర ప్రొఫెషన్ లో ఉన్న వారందరూ సైతం ఆచరించడంతో సమాజంలో అందరికీ ఒక ఆరోగ్యవంతమైన సందేశాన్ని చేర్చిన వారవుతారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ క్రీడల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని చాటాలని ఆయన ఆకాంక్షించారు. షటిల్ బ్యాట్మెంటన్ పోటీలకు అవసరం ఉన్న సెటిల్ బ్యాట్మెటన్ కోర్టును ఆడుకునేందుకు సహకరించిన ఆఫీసర్స్ క్లబ్ సభ్యులకు ప్రత్యేకంగా ప్రెస్ క్లబ్ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.ఇందులో భాగంగా పాల్గొంటున్న క్రీడాకారులను పరిచయం చేసుకొని టాస్ వేసి కొంతసేపు బ్యాడ్మింటన్ అడి పోటీలను ప్రారంభించారు.
నిజామాబాద్ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పంచ రెడ్డి శ్రీకాంత్, సుభాష్ వాగ్మారే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో కార్యక్రమంలో మొత్తం ఆరు టీంలు పేర్లు నమోదు చేసుకున్నారు.
ఆరు మ్యాచ్లలో పుల్గం శ్రీకాంత్ రవీందర్ నాయక్ జట్టు ,రాజ్ కుమార్, కోర్న సందీప్ జట్టు ఫైనల్ తలపడగా రాజ్ కుమార్ సందీప్ జట్టు పై శ్రీకాంత్ రవీందర్ నాయక్ జట్టు గెలుపొందింది. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కోశాధికారి రాజ్ కుమార్, ఈ పోటీ నిర్వహణ ఇన్చార్డులు బీసీ సభ్యుడు సి. ఎస్. జయపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ బి, రాజు, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు,జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
