సేవాభావం ఉన్న వారిని లయనిజంలోకి ఆహ్వానించాలని ఆయన పేర్కొన్నారు..లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిజామాబాదు నగరంలోని వినాయక నగర్ సందీప్ గార్డెన్స్ లో శుక్రవారం రాత్రి అట్టహాసంగా జరిగింది..క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పి.రాఘవేందర్,చింతల గంగాదాస్, కోశాధికారి అంకం రాజేందర్ లతో పాటు మిగతా కార్యవర్గం ప్రమాణం చేసింది..
ఈ కార్యక్రమానికి లయన్స్ జిల్లా పూర్వ గవర్నర్ పి.బసవేశ్వరరావు ముఖ్యాతిధిగా హాజరై ప్రసంగించారు.లయన్స్ క్లబ్బులు ప్రపంచ వ్యాప్తంగా నిస్వార్దంగాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.ప్రజోపయోగ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన సూచించారు.
లయన్స్ క్లబ్ జిల్లా పూర్వ గవర్నర్లుడి.పెంటయ్య,ఇరుకుల వీరేశం, లయన్స్ జిల్లా అడిషనల్ క్యాబినెట్ ట్రెజరర్ పి.లక్ష్మినారాయణ,జిల్లా కార్యదర్శి డి.యాదగిరి, రీజియన్ చైర్మెన్ పి.హన్మాండ్లు,,రీజియన్ కార్యదర్శి నాగేశ్వరరావు,జోన్ చైర్మెన్లు అబ్బాయి లింబాద్రి,హీరమల్ల విష్ణు వర్దన్,అందె శివాజి,ప్రోగ్రామ్ చైర్మెన్ ఇరుమల శివలింగం,తదితరులు పాల్గొన్నారు
