HomeCRIMEకులం పేరుతో దూషించి హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

కులం పేరుతో దూషించి హత్య.. నిందితుడికి జీవిత ఖైదు

సెప్టిక్‌ ట్యాంకులో మృతదేహం దాచిన కేసులో తీర్పుడబ్బుల విషయంలో తలెత్తిన వివాదంతో వ్యక్తిని కులం పేరుతో దూషించి హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధిస్తూ నిజామాబాద్‌ రెండో అదనపు జిల్లా సెషన్స్‌ జడ్జి (ఎస్సీ, ఎస్టీ కోర్టు) ఎస్‌. నారాయణ తీర్పు వెలువరించారు.

కామారెడ్డి జిల్లా పెద్దకొడపగల్‌లో 2023 నవంబరులో జరిగిన ఈ ఘటనపై పోలీసులు పకడ్బందీగా దర్యాప్తు చేసి న్యాయస్థానంలో నేరాన్ని నిరూపించారు.పెద్దకొడపగల్‌కు చెందిన కారాడి సాయికుమార్‌ (25), బసవరాజ్‌ అలియాస్‌ బసవయ్య తరచూ కలిసి తిరిగేవారు.

నిందితుడు స్థలం విక్రయించగా వచ్చిన రూ.25 లక్షల విషయం తెలుసుకున్న మృతుడు తనకు డబ్బులు ఇవ్వాలని అడిగాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. బసవయ్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్న సాయికుమార్‌.. కొత్తగా నిర్మిస్తున్న ఇంట్లో విందు ఇస్తానంటూ పిలిచి మద్యం తాగించాడు.

2023 నవంబరు 25 అర్ధరాత్రి డబ్బుల విషయంలో మరోసారి గొడవ జరగడంతో కులం పేరుతో దూషిస్తూ కర్రతో తలపై కొట్టాడు. అనంతరం కొబ్బరి తాడుతో మెడకు బిగించి, కాళ్లు కట్టి సెప్టిక్‌ ట్యాంకులో పడవేసి హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.బసవరాజ్‌ నవంబరు 25న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు.

మూడు రోజుల తర్వాత నిందితుడి నిర్మాణంలో ఉన్న ఇంటి ఆవరణలోని సెప్టిక్‌ ట్యాంకులో కాళ్లకు తాడు కట్టి ఉన్న మృతదేహాన్ని గుర్తించారు. మృతుడి నాయనమ్మ మెట్టు మీది పాపవ్వ ఫిర్యాదుతో పెద్దకొడపగల్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కుటుంబ సభ్యులు, స్థానికులు, చుట్టుపక్కల వారిని విచారించి సాక్ష్యాధారాలు సేకరించారు. అనంతరం సాయికుమార్‌ను అరెస్టు చేసి న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు.సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి జీవిత ఖైదు, రూ.1,000 జరిమానా విధించింది.

కేసులో సమర్థంగా దర్యాప్తు నిర్వహించి నిందితుడికి శిక్ష పడేలా కృషి చేసిన అప్పటి డీఎస్పీ కె. జగన్నాథ్‌రెడ్డి, ప్రస్తుత బాన్సువాడ డీఎస్పీ పి. విఠల్‌రెడ్డి, పెద్దకొడపగల్‌ ఎస్‌హెచ్‌వో జి. అరుణ్‌కుమార్‌, కోర్టు లైజనింగ్‌ అధికారులు ఏఎస్ఐలు రాజేశ్వర్‌, శ్రీనివాస్‌, సీడీవో జి. రవిచంద్రగౌడ్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఆర్‌. దయాకర్‌గౌడ్‌లను కామారెడ్డి జిల్లా ఎస్పీ ఎం. రాజేష్‌ చంద్ర అభినందించారు. నేరం చేసినవారు ఎంత చాకచక్యంగా వ్యవహరించినా సాక్ష్యాధారాల ముందు తప్పించుకోలేరని ఆయన పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments