Friday, April 24, 2026
HomeCRIMEఆన్ గేమింగ్​కు మరో యువకుడు బలి.. ఉరేసుకుని ఆత్మహత్య

ఆన్ గేమింగ్​కు మరో యువకుడు బలి.. ఉరేసుకుని ఆత్మహత్య

ఆన్​లైన్​ గేమింగ్​కు మరో యువకుడు బలయ్యాడు. అప్పులు చేసి, వాటిని తీర్చలేక తీవ్ర ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకుంది.


ఆన్లైన్ గేమ్స్ కు అలవాటు పడ్డ యువకుడు అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులకు తీవ్ర శోకం మిగిల్చాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
స్థానిక సీఐ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని ఓంశాంతి కాలనీకి చెందిన వల్లందేసి గోదావరికి శ్రీనాథ్, శ్రీకర్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనాథ్​కు వివాహం అయింది.

శ్రీకర్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
కాగా, శ్రీకర్​ ఏడాదిన్నర కాలంగా ఆన్​లైన్​ గేమ్స్​ ఆడుతున్నాడు. ఈ క్రమంలో విపరీతంగా అప్పులు చేశాడు. అయితే రుణదాతల ఒత్తిడి భరించలేక ఉన్న ఇల్లు అమ్ముకుని కొన్ని అప్పులు తీర్చాడు.

మిగతావి ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.గురువారం (జనవరి 01) తల్లి గోదావరి కూరగాయలు కొనడానికి మార్కెట్​కు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో ఒక్కడే ఉన్న శ్రీకర్ బెడ్​రూంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!