HomeTelanganaNizamabadనూతన కలెక్టర్‌ ను కలిసిన ఎంపీ అరవింద్‌..

నూతన కలెక్టర్‌ ను కలిసిన ఎంపీ అరవింద్‌..

నిజామాబాద్‌ జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఇలా త్రిపాఠిని పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం జిల్లా సమగ్ర కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ)లో కలెక్టర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లాలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులు, కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ఎంపీ ఆరా తీశారు. నియోజకవర్గ పరిధిలో పెండింగ్‌లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్‌కు సూచించారు.

పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడంలో అధికార యంత్రాంగం సమర్థవంతంగా కృషి చేయాలన్నారు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని ఎంపీ ఈ సందర్భంగా కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments