HomeCRIMEఅంతర్రాష్ట్ర ఏటీఎం దొంగల ముఠా అరెస్టు..పకడ్బందీగా ఛేదించిన పోలీసులు..హర్యానా ముఠాతో చేతులు కలిపిన హైదరాబాద్ యువకుడు..

అంతర్రాష్ట్ర ఏటీఎం దొంగల ముఠా అరెస్టు..పకడ్బందీగా ఛేదించిన పోలీసులు..హర్యానా ముఠాతో చేతులు కలిపిన హైదరాబాద్ యువకుడు..

రెండు వాహనాలు, గ్యాస్ కట్టర్లు, సిలిండర్లు స్వాధీనం జిల్లాలో వరుస ఏటీఎం దొంగతనాలకు పాల్పడుతూ హల్చల్ చేస్తున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ఎట్టకేలకు నిజామాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

నిందితుల నుంచి రెండు వాహనాలతో పాటు దొంగతనానికి ఉపయోగించే గ్యాస్ కట్టర్లు, సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపి సాయి చైతన్య ఈ కేసు వివరాలను వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 31న అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 2:19 గంటలకు) నగరంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను ముఠా నాయకుడు హర్యానా కు చెందిన అబ్దుల్లా ఖాన్ ,వాజీబ్ ఖాన్,మొహమ్మద్ అజీబ్,శామోద్దిన్ @ ఇక్రామ్, లతో పాటు హైదారాబాద్ కు చెందిన మొహమ్మద్ అమీర్ లు ఐదుగురు కలిసి ధ్వంసం చేశారని గుర్తు చేశారు.

గ్యాస్ కట్టర్‌తో మిషన్‌ను కోసి నగదు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అటుగా పెట్రోలింగ్ చేస్తున్న బ్లూ కోల్ట్స్ సిబ్బంది న్యాలకంటి లక్ష్మణ్ అప్రమత్తతతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి, సిపి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

ఈ మేరకు జనవరి 8న మధ్యాహ్నం సమయంలో నిఖిల్ సాయి రోడ్డు వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా, అనుమానాస్పదంగా వచ్చిన ఒక బొలెరో (AP 20 AB 1617) వాహనాన్ని పోలీసులు ఆపారు. అందులో కర్రలు, రాళ్లతో ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హర్యానాకు చెందిన అబ్దుల్లా పాత నేరస్తుడు.

గతంలో ఉదయపూర్, శివపురి ఏటీఎం దొంగతనాల కేసులో జైలుకు వెళ్ళాడు. అదే సమయంలో హైదరాబాద్‌కు చెందిన అమీర్ అనే యువకుడు ఒక ‘పోక్సో’ (POCSO) కేసులో జైలుకు వెళ్లగా, అక్కడ వీరికి పరిచయం ఏర్పడింది. బయటకు వచ్చాక వీరంతా ఒక గ్యాంగ్ గా ఏర్పడి తెలంగాణలో ఏటీఎంలను కొల్లగొట్టాలని ప్లాన్ చేశారు. జూలై 2025: షాపూర్ నగర్ (హైదరాబాద్) లోని హెచ్‌డిఎఫ్‌సి ఏటీఎంను గ్యాస్ కట్టర్‌తో కోసి రూ. 30 లక్షలు ఎత్తుకెళ్లారు.

ఆ తర్వాత నిందితుల్లో కొందరు దొరికినా, ప్రధాన నిందితుడు అబ్దుల్లా పరారీలో ఉన్నాడన్నారు. 2025 డిసెంబర్ 31 తేదీన అబ్దుల్లా, అమీర్, వాజీబ్, అబీద్, ఇక్రామ్ కలిసి కొత్త గ్యాంగ్‌గా ఏర్పడ్డారు.వీరంతా జహీరాబాద్‌లో ఒక సాంట్రో కారును, ఆ తర్వాత ఒక బొలెరో వాహనాన్ని దొంగిలి అదే రోజు రాత్రి నిజామాబాద్‌లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంలో చొరబడి సీసీ కెమెరాలకు నల్లటి స్ప్రే కొట్టి దొంగతనానికి ప్రయత్నించారు.

కేన్ అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు వస్తున్నారని భయపడి కెమెరాలను ఎత్తుకెళ్లారు. అదే రాత్రి: డిచ్‌పల్లి సమీపంలోని అర్గుల్ వద్ద మరో ఏటీఎంను పగులగొట్టే ప్రయత్నం చేయగా అలారం మోగడంతో వాహనాన్ని ఇందల్వాయి పొదల్లో దాచి పరారయ్యారు.దీంతో శుక్రవారం నిందితులను పట్టుకొని రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

నిందితుల నుంచి ఒక బొలెరో, ఒక బలెనో కారు, చిన్న ఆక్సిజన్ మరియు ఎల్పీజీ సిలిండర్లు, గ్యాస్ కట్టర్, సర్జికల్ గ్లౌజులు, స్ప్రే బాటిల్, ఇనుప రాడ్లు, మాస్టర్ కీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు చెందిన సమర్థవంతంగా పనిచేసి ముఠాను పట్టుకున్న పోలీసు బృందాన్ని సీపీ అభినందించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments