HomeCRIMEహత్యల కంటే రోడ్డు ప్రమాద మరణాలే ఎక్కువ..!నిర్లక్ష్యం వీడండి.. ప్రాణాలు కాపాడుకోండి: సీపీ సాయి చైతన్య

హత్యల కంటే రోడ్డు ప్రమాద మరణాలే ఎక్కువ..!నిర్లక్ష్యం వీడండి.. ప్రాణాలు కాపాడుకోండి: సీపీ సాయి చైతన్య

సమాజంలో పెరిగిపోతున్న నేరాల కంటే, రహదారిపై జరుగుతున్న అజాగ్రత్త మరణాలే అత్యంత ఆందోళనకరంగా మారుతున్నాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆవేదన వ్యక్తం చేశారు.

మంగళవారం నగరంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం లో ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ అధ్యక్షతన నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, జిల్లాలో జరుగుతున్న మరణాల గణాంకాలను వివరిస్తూ ప్రజలను హెచ్చరించారు. “ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా వివిధ కారణాల వల్ల 40 హత్యలు జరిగితే, కేవలం రోడ్డు ప్రమాదాల వల్లే ఏకంగా 250 మంది ప్రాణాలు కోల్పోయారు.

అంటే హత్యల కంటే రహదారి మరణాలే ఐదు రెట్లు ఎక్కువగా ఉండటం మన సమాజం డ్రైవింగ్ పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేస్తోంది” అని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

గతంలో కోవిడ్ మహమ్మారి నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మాస్కు ధరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే తరహాలో వాహనదారులు రోడ్డుపైకి వచ్చినప్పుడు ప్రాణ రక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పిలుపునిచ్చారు.

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం.కార్లలో ప్రయాణించే వారు సీట్ బెల్ట్ విస్మరించడం.

డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్‌లో మాట్లాడటం, అతి వేగం, ట్రాఫిక్ నిబంధనల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఎక్కువ జరుగుతున్నాయన్నారు. కేవలం జరిమానాల కోసమే కాకుండా, మీ కుటుంబ సభ్యుల కోసం సురక్షితంగా ఇంటికి చేరుకోవాలనే బాధ్యతను పెంచుకోవాలని సీపీ సూచించారు.

అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న వారందరితో రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేయించారు.

అనంతరం ఉచిత హెల్మెట్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్జున అవార్డు గ్రహీత బాక్సర్ మహ్మద్ హుస్సాముద్దీన్, అదనపు డీసీపీ బాస్వారెడ్డి, నిజామాబాద్ ఏసిపి రాజా వెంకటరెడ్డి, డిటిఓ ఉమామహేశ్వర్ రావు,ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ,పలువురు డాక్టర్లు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments