ఈనెల 10 నుండి 12 వరకు తెలంగాణ గురుకుల పాఠశాల బెల్లంపల్లి క్రీడా మైదానం, మంచిర్యాల జిల్లాలో జరిగిన 69వ రాష్ట్ర స్కూల్ గేమ్స్ సాఫ్ట్ బాల్ బాలుర పోటీలలో జిల్లా జట్టు సెమీఫైనల్ లో మహబూబ్నగర్ జట్టు పై 7-0 పరుగుల తేడాతో గెలుపొంది ఫైనల్ కు చేరి ఫైనల్ మ్యాచ్లో మెదక్ జిల్లా జట్టుపై తలపడి నువ్వా నేనా అన్నట్టు సాగిన మ్యాచ్లో 01-02 పరుగుల తేడాతో ఓటమి చెంది ద్వితీయ స్థానం కైవసం చేసుకున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రవికుమార్ తెలిపారు.
ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథి తాళ్ల గురజాల గ్రామ సర్పంచ్ మరియు జాతీయ సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు రామన్న, మంచిర్యాల జిల్లా స్కూల్ గేమ్స్ అండర్-19 కార్యదర్శి బాబురావు మరియు టోర్నమెంట్ రాష్ట్ర అబ్జర్వర్ మర్కంటి గంగా మోహన్ లు పాల్గొని బహుమతులు అందజేశారు.
జిల్లా జట్టుకు కోచ్ మేనేజర్లుగా నరేష్, సాయికుమార్ మరియు తిరుపతి వ్యవహరించారు.జాతీయ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు సిహెచ్ అరవింద్ (సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఆర్మూర్),ఎం ప్రీతం (ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్ ఆర్మూర్)మరియు సిహెచ్ హర్షిత్ (ఆల్ ఫోర్స్ హై స్కూల్ మామిడిపల్లి) లు ఎంపికైనారు. జాతీయ సాఫ్ట్ బాల్ పోటీలు ఈనెల 29 నుండి ఫిబ్రవరి 02 వరకు మహారాష్ట్రలోని నాగపూర్ లో జరగనున్నవి.
