HomeTelanganaNizamabadజర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి..సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి..సానుకూలంగా స్పందించిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి

నిజామాబాద్ నగరంలో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని నగర ప్రెస్ క్లబ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంగళవారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, కార్యదర్శి వాగ్మారే సుభాష్‌తో పాటు పలువురు కమిటీ సభ్యులు కలిసి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిని, అలాగే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డిని వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు అందజేశారు.

జర్నలిస్టుల విన్నపంపై ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. సమస్య పరిష్కార దిశగా ఆయన వెంటనే ఆర్డీఓ తో ఫోన్‌లో మాట్లాడి, ఈ అంశంపై చర్చించారు.

జర్నలిస్టుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకునేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి కూడా జర్నలిస్టుల పట్ల సానుకూల దృక్పథంతో ఉండి, వారి సమస్య పరిష్కారానికి తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments