తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నగేష్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నగేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంతోమంది త్యాగాల ఫలితంగా, కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ కల సాకారమైందని గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సమయంలో మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని గత పాలకుల నిర్లక్ష్యంతో అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు.
నేడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుల భారాన్ని భరిస్తూనే, సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో ముందుకు తీసుకెళ్తోందని స్పష్టం చేశారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని నగేష్‌రెడ్డి తెలిపారు.
ఇందులో భాగంగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500 కే వంట గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు వంటి నిర్ణయాలు తీసుకున్నామన్నారు. రైతుల కోసం రైతు భరోసా, రుణమాఫీతో పాటు సన్నవడ్లకు బోనస్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇంటి నిర్మాణాలకు రూ.5 లక్షల సాయం అందించే ప్రక్రియను కూడా వేగవంతం చేశామని, జిల్లాలో 16 వేల ఇళ్లను మంజూరు చేశామని వెల్లడించారు. జిల్లా అభివృద్ధికి సీనియర్ నేత సుదర్శన్‌రెడ్డి మార్గదర్శకత్వంలో ముందుకెళ్తామని ఆయన చెప్పారు.నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ.. రాజకీయ లాభనష్టాలను పక్కనబెట్టి, తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారని కొనియాడారు.
గత పాలకుల కుటుంబ ప్రయోజనాలకే పరిమితమైన పాలనను పక్కనపెట్టి, ప్రజాహితమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి, మహేష్‌కుమార్‌గౌడ్ సారథ్యంలో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవత్సలం, ఉపాధ్యక్షులు కౌడపు శరత్ కుమార్, రత్నాకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్, మాజీ ఫ్లోర్ లీడర్ రాజేంద్రప్రసాద్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, ఎస్సీ సెల్ కన్వీనర్ సాయిలు, నాయకులు రత్నాకర్, బంటు బలరాం, కార్పొరేటర్ అన్వర్, ఎర్రం గంగాధర్, మీసాల సుధాకర్ రావు, జెండా గుడి చైర్మన్ లవంగ ప్రమోద్, మహిళా నాయకులు పోల ఉష, స్వప్న, అపర్ణ, ఏఎంసీ డైరెక్టర్ రఘు, పూల శంకర్, అహ్మద్, ఆకుల మహేందర్, పుప్పాల రవి, రాజు గగన్ తదితరులు పాల్గొన్నారు.
