HomeTelanganaNizamabadకాసేపట్లో రిజర్వేషన్ ల ఫై తొలగనున్న ఉత్కంఠ .....మున్సిపల్ వార్డుల మహిళా రిజర్వేషన్ల ఖరారు...

కాసేపట్లో రిజర్వేషన్ ల ఫై తొలగనున్న ఉత్కంఠ …..మున్సిపల్ వార్డుల మహిళా రిజర్వేషన్ల ఖరారు రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్ లో డ్రా

మున్సిపల్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో భాగంగా రిజర్వేషన్ లపై నెలకొన్న ఉత్కంఠ కాసేపట్లో తొలగనుంది. నిజామాబాద్ జిల్లాలోని నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు భీంగల్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీల వార్డులకు మహిళా రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం(కలెక్టరేట్)లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ డ్రా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి సారథ్యంలో ఈ పక్రియ జరుగనుంది .

భీంగల్ మున్సిపాలిటీకి సంబంధించిన వార్డుల మహిళా రిజర్వేషన్ల ఖరారు కోసం ఉదయం 10.00 గంటలకు డ్రా నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపాలిటీ వార్డుల ఖరారుకై ఉదయం 10.15 గంటలకు, బోధన్ మున్సిపాలిటీ వార్డుల రిజర్వేషన్ల ఖరారు కోసం ఉదయం 10.30 గంటలకు, నిజామాబాద్ నగర పాలక సంస్థ డివిజన్లలో మహిళా రిజర్వేషన్ల ఖరారు కోసం ఉదయం 11.00 గంటలకు డ్రా ప్రక్రియ కొనసాగనుంది .

ఈ సమావేశానికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సకాలంలో హాజరు కానున్నారు . ముఖ్యంగా మేయర్ స్థానం రిజర్వేషన్ విషయంలోనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇందుకు సంబందించి కసరత్తులు ఎన్నికల సంఘం ఇప్పటికే పూర్తీ చేసింది. ఈ రోజే ప్రకటన వెలుబడే ఛాన్స్ ఉంది.

60 డివిజన్ లున్న నగరంలో ఏ ఏ వర్గాలకు ఎన్ని డివిజన్ లు దక్కబోతున్నాయనేది స్పష్టం కానుంది .అన్ రిజర్వ్డ్ మొత్తం 30 స్థానాలు. ఇందులో జనరల్ 14, మహిళలకు 16 కేటాయించారు.

బీసీ కేటగిరీ : మొత్తం 24 స్థానాలు. ఇందులో జనరల్ 12, మహిళలకు 12 కేటాయింపు. *ఎస్సీ కేటగిరీ* మొత్తం 5 స్థానాలు. జనరల్ 3, మహిళలకు 2 కేటాయించారు. ఎస్టీ కేటగిరీ ఒక స్థానం (1) కేటాయించారు.అయితే బీసీ లకు ఏ ఏ డివిజన్ దక్కబోతున్నాయి ఏ డివిజన్ లు ఆన్ రిజర్వ్ గా ఉండబోతున్నాయనేది ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠగా మారాయి. మరో వైపు కీలకమైన మేయర్ స్థానం ఏ వర్గాలకు దక్కనుందనేది సర్వత్రా చర్చనీయాంశం అయింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments