నందిపేట మండల కేంద్రంలోని శివసాగర్ బీడీ సెంటర్ (దేశాయ్ కంపెనీ)లో పనిచేస్తున్న వివిధ విభాగాల కార్మికులకు వేతనాలు పెరిగాయి. గురువారం (మే 7న) కంపెనీ ప్రతినిధులు, కార్మిక సంఘం నాయకుల మధ్య జరిగిన చర్చలు ఫలించాయి. ఈ సందర్భంగా పెరిగిన వేతనాల వివరాలను యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం. నరేందర్ కార్మికులకు వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. బీడీ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న ప్యాకర్లు, నెలసరి ఉద్యోగులు, చాటర్లు, బట్టివాలాలతో పాటు బీడీలు చుట్టే కార్మికులకు ఈ వేతన పెంపు వర్తిస్తుందని పేర్కొన్నారు.
పెరిగిన జీతాలు మే 1, 2026 నుంచే అమల్లోకి వస్తాయని, ఈ అవకాశాన్ని కార్మికులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు డి. రాజేశ్వర్, జిల్లా నాయకులు సాయరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యజమాన్యంతో జరిపిన చర్చలు సఫలం కావడం పట్ల కార్మికులు సంతృప్తి వ్యక్తం చేశారు.
