నగర శివారులోని గంగస్థాన్ ఫేజ్-1లో గల ఓ అపార్ట్మెంట్పై సీసీఎస్ పోలీసులు మెరుపు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి నుంచి నగదు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య, ఆదేశాల మేరకు, సీసీఎస్ ఏసీపీ (ఇంచార్జ్) మస్తాన్ అలీ సూచనలతో ఎస్ఐ గోవింద్ తన సిబ్బందితో కలిసి శుక్రవారం సాయంత్రం గంగస్థాన్లోని ‘సాయి రుద్వి’ అపార్ట్మెంట్పై దాడి ఏడుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు.
వారి వద్ద నుంచి రూ. 22,060/- నగదు, 7 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ కు అప్పగించినట్లు ఎస్ఐ గోవింద్ తెలిపారు.
