పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ వర్గాల ప్రజలు, సంఘాల నేతలు స్వచ్ఛందంగా గులాబీ జెండా నీడకు చేరుతున్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల సమక్షంలో భారీ ఎత్తున చేరికలు జరిగాయి.
నగరంలో జరిగిన అభివృద్ధి పనులే తమను పార్టీ వైపు నడిపించాయని ఈ సందర్భంగా చేరిన నాయకులు పేర్కొన్నారు. ప్రముఖ పత్రిక రిపోర్టర్ దువ్వ వెంకట్ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరారు. వీరికి మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అలాగే నిజామాబాద్ మేస్త్రి సంఘం అధ్యక్షులు పెంచాల వేణు నేతృత్వంలో పెంచాల శ్రీనివాస్, శ్రీలత, మహేష్ తదితరులు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. గణేష్ బిగాలఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ.. పార్టీ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి సముచిత గౌరవం లభిస్తుందని భరోసా ఇచ్చారు.
నిజామాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీదేనని, భవిష్యత్తులో కూడా ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
