HomeTelanganaNizamabadమేయర్ డివిజన్ పై ఎంపీ కసరత్తులు..18 వ డివిజన్ వైపు నేతల మొగ్గు..

మేయర్ డివిజన్ పై ఎంపీ కసరత్తులు..18 వ డివిజన్ వైపు నేతల మొగ్గు..

ఈసారి ఎలాగైనా మేయర్ పీఠం సాదించాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ఇంకా . మున్సిపల్ ఎన్నికల నగారా మోగకముందే అభ్యర్థుల కోసం ఎడతెగని కసరత్తులు చేస్తుంది.

ఎంపీ అర్వింద్ మూడు రోజులుగా నగరంలోనే మకాం వేశారు పార్టీ సీనియర్ల ప్రముఖల తో విరివిరిగా భేటీ అవుతున్నారు.ఆయా డివిజన్ లలో బలమైన అభ్యర్థుల కోసం సన్నాహాలు చేస్తున్నారు ముఖ్యంగా మేయర్ అభ్యర్థి పోటీ చేసే డివిజన్ విషయంలో అర్వింద్ సీరియస్ గా ఫోకస్ పెట్టారు.

ఇందులో భాగంగా నగరంలోని సీనియర్ నేతలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ఎన్నికల సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారు. నిజామాబాద్ మేయర్ పీఠం ‘జనరల్ మహిళ’ కే దక్కడంతో ఆశావహుల సంఖ్య పెరిగింది. నగరంలోని మొత్తం 60 డివిజన్లలో జనరల్ మహిళలకు 16 స్థానాలను కేటాయించారు.

జనరల్ స్థానాల్లో ఏ డివిజన్ నుంచి మేయర్ అభ్యర్థి బరి లోకి దించాలని కసరత్తులు జరుగుతున్నాయి 18 డివిజన్ నుంచి మేయర్ అభ్యర్థి బరిలోకి దింపే ఆలోచనలో అర్వింద్ ఉన్నారు. అభ్యర్థి ఎవరనే విషయంలో ఇంకా స్పష్టత లేక పోయినప్పటికి18 డివిజన్ లో నే మేయర్ అభ్యర్థి పోటీ చేయడానికి మాత్రం రంగం సిద్ధం అయింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments