మేయర్ పీఠం ఫై గురి పెట్టిన ప్రధాన పార్టీలు డివిజన్ లలో బలమైన అభ్యర్థుల కోసం ఎడతెగని కసరత్తులు మొదలు పెట్టాయి. ముఖ్యంగామేయర్ అభ్యర్థులుగా పోటీ చేసే డివిజన్ ల కోసం అన్వేషిస్తున్నారు.
మేయర్ అభ్యర్థి కి సేఫ్ గా ఉండే డివిజన్ విషయంలో ప్రత్యేక సర్వే లు జరుగుతుండడం గమనార్హం. తమ పార్టీకి అత్యంత సురక్షితం బావించే డివిజన్ నుంచే మేయర్ అభ్యర్థి ఉండాలనేది ప్రధాన పార్టీల ఆలోచనగా ఉంది.
ఏ పార్టీకి మెజార్టీ కార్పొరేటర్లు గెలిస్తే వారికి మేయర్ స్థానం దక్కే ఛాన్స్. ఉంది ఎవరికి వారే ఎత్తుగడ ల్లో ఉన్నారు మేయర్ స్థానం తమదే అనే ధీమాతో ఉన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.
మేయర్ అభ్యర్థులే డివిజన్ లలో తమ అభ్యర్థులకు ఆర్థిక సహకారం ఇవ్వాలి. భారీ ఎత్తున ఆర్థిక భారం కూడా ! అందుకే మేయర్ అభ్యర్థి పోటీ చేసే స్థానం మీద ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి.
బీజేపీ 18 డివిజన్ లో మేయర్ అభ్యర్థిని రంగంలోకి దించే ఆలోచన లో ఉంది మరో వైపు కాంగ్రెస్ 17 డివిజన్ తో పాటు మరో రెండు డివిజన్ ల మీద దృష్టి పెట్టింది ఇందులో భాగంగా 17 డివిజన్ లో మాజీ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తన కోడలు ను బరిలోకి దించడానికి సిద్ధం అవుతున్నారు.
కార్పొరేషన్ ఛైర్మెన్ గా ఉన్న ఉన్న ఆయన సుదర్శన్ రెడ్డి సన్నిహితుడి ఉన్నారు. ఇదే డివిజన్ నుంచి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సన్నిహితుడు పూరన్ రెడ్డి సోదరి బరిలోకి దిగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు
