HomeLaw and Orderడివిజన్ ల రిజర్వేషన్ ఫై దుమారం .....మూడు డివిజన్ లలో సరిదిద్దాలని కోర్టు ఆదేశాలు

డివిజన్ ల రిజర్వేషన్ ఫై దుమారం …..మూడు డివిజన్ లలో సరిదిద్దాలని కోర్టు ఆదేశాలు

రేపో మాపో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రాబోతుండగా నిజామాబాద్ నగరం లో డివిజన్ ల రిజర్వేషన్ ల వ్యవహారం వివాదం తలెత్తడం అధికారులను టెన్షన్ పెడుతుంది. మూడు డివిజన్ లలో రిజర్వేషన్ లను మూడు రోజుల్లో తేల్చాలంటూ హైకోర్టు జిల్లా కలెక్టర్ ను ఆదేశించడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

నగరంలో 60 డివిజన్ లకు సంబంధించి యస్సి యస్టీ బీసీ మహిళా లకు సంబంధించి రిజర్వేషన్ పక్రియ ను కలెక్టర్ అన్ని పార్టీల సమక్షంలో ఖరారు చేసారు.కానీ యస్సి లకు డివిజన్ ల కేటాయింపులో బీజేపీ నేతలు మొదటి రోజే ఆక్షేపించారు.60 డివిజన్ లలో యస్సి లకు అయిదు డివిజన్ లు కేటాయించారు.

కానీ ఆ సామాజిక వర్గం వోటర్ల నా మాత్రంగా ఉన్న డివిజన్ లేనే కేటాయించడం వెనుక రాజకీయ దురుద్దేశ్యం వుందని బీజేపీ దుయ్య బట్టింది. నగరంలో యస్సి వోటర్లు ఎక్కువగా ఉన్న డివిజన్ లు వారికి కేటాయిస్తే బాగుటఁదనేది బీజేపీ వాదన.


ముఖ్యంగా 39, 40, 44 డివిజన్ లు యస్సి లకు రిజర్వేషన్‌ చేయడాన్ని సవాల్ చేస్తూ బజేపీ కి చెందిన బీసీ సంఘాల నేత లక్ష్మి నారాయణ గత మూడు రోజుల క్రితం హైకోర్టు ను ఆశ్రయించారు.దీనిపై సుదీర్ఘ వాదనలు విన్న ధర్మాసనం సంచలన ఆదేశాలు జారీచేసింది. జి.ఓ. ఎం.ఎస్. నెం.14 మార్గదర్శకాలకు విరుద్ధంగా జరిగిందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.


ఈ కేటాయింపులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా మరియు యథేచ్ఛగా జరిగాయని పిటిషనర్ వాదించారు. అందువల్ల, సంబంధిత వార్డుల రిజర్వేషన్‌ను ఎస్‌సి కేటగిరీ కాకుండా ఇతర కేటగిరీలకు కేటాయించాలనేది పిటిషనర్ వాదన.

22 11 10 46 డివిజన్ లలో యస్సి సామజిక వర్గం వోట్లు భారీగా ఉన్నాయని ఆ డివిజన్ లే కేటాయిస్తే బాగుటుందని పిటిషనర్ కోర్టు ను నివేదించారు అయితే హైకోర్టు తాజా ఆదేశాలు నేపథ్యంలో జిల్లా కలెక్టర్ నగరంలో డివిజన్ రిజర్వేషన్ ను సరిదిద్దుతుందా లేదా అనేది ఆసక్తిగా మారింది మూడు డివిజన్ ల రిజర్వేషన్ మారితే మొత్తం రిజర్వేషన్ పక్రియ మార్చే పరిస్థితి వుంటుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments