Wednesday, April 29, 2026
HomeLaw and Orderకౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులకు అనుమతి నిరాకరణ..

కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థులకు అనుమతి నిరాకరణ..

నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతి నిరాకరించడంతో గందరగోళం నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, లోపలికి వెళ్లేందుకు అభ్యర్థులను అధికారులు అనుమతించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. కేవలం ‘కౌంటింగ్ పాస్’ ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసుల నిబంధనపై అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటింగ్ పాస్‌లు అవసరం లేదని, పోలింగ్ రోజు ఇచ్చిన ఏజెంట్ పాస్‌లే సరిపోతాయని గతంలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) స్పష్టం చేసినట్లు అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు. ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ పాస్‌లు అవసరమని, అభ్యర్థులకు పాత పాస్‌లే సరిపోతాయని చెప్పిన అధికారులు.. తీరా సమయానికి మాట మార్చారని వారు మండిపడుతున్నారు. లోపల అప్పుడే లెక్కింపు ప్రారంభం కావడంతో సుమారు 20 మందికి పైగా అభ్యర్థులు గేటు బయటే ఆందోళనగా నిరీక్షిస్తున్నారు. తమ ప్రతినిధులు లేకుండా లెక్కింపు జరగడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “ఆర్వో చెప్పిన మాట నమ్మి మేము వచ్చాం. ఇప్పుడు గేటు వద్ద పోలీసులు అడ్డుకుంటుంటే సమాధానం చెప్పే నాధుడు లేడు” అని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆర్వో అధికారులు తక్షణమే స్పందించి, తాము లోపలికి వెళ్లేలా చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులను అనుమతించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతి నిరాకరించడంతో గందరగోళం నెలకొంది.

కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ, లోపలికి వెళ్లేందుకు అభ్యర్థులను అధికారులు అనుమతించకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారింది. కేవలం ‘కౌంటింగ్ పాస్’ ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తామన్న పోలీసుల నిబంధనపై అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల నిబంధనల ప్రకారం అభ్యర్థులకు ప్రత్యేకంగా కౌంటింగ్ పాస్‌లు అవసరం లేదని, పోలింగ్ రోజు ఇచ్చిన ఏజెంట్ పాస్‌లే సరిపోతాయని గతంలో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) స్పష్టం చేసినట్లు అభ్యర్థులు గుర్తు చేస్తున్నారు.

ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ పాస్‌లు అవసరమని, అభ్యర్థులకు పాత పాస్‌లే సరిపోతాయని చెప్పిన అధికారులు.. తీరా సమయానికి మాట మార్చారని వారు మండిపడుతున్నారు. లోపల అప్పుడే లెక్కింపు ప్రారంభం కావడంతో సుమారు 20 మందికి పైగా అభ్యర్థులు గేటు బయటే ఆందోళనగా నిరీక్షిస్తున్నారు.

తమ ప్రతినిధులు లేకుండా లెక్కింపు జరగడంపై వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. “ఆర్వో చెప్పిన మాట నమ్మి మేము వచ్చాం. ఇప్పుడు గేటు వద్ద పోలీసులు అడ్డుకుంటుంటే సమాధానం చెప్పే నాధుడు లేడు” అని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఆర్వో అధికారులు తక్షణమే స్పందించి, తాము లోపలికి వెళ్లేలా చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అభ్యర్థులను అనుమతించకపోవడం ప్రజాస్వామ్య విరుద్ధమని, వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!