Wednesday, April 29, 2026
HomeLaw and Orderమొదలైన ఓట్ల లెక్కింపు ....ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ సీల్ తొలగింపు.....భారీ బందోబస్తు కౌంటింగ్...

మొదలైన ఓట్ల లెక్కింపు ….ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ సీల్ తొలగింపు…..భారీ బందోబస్తు కౌంటింగ్ సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల సందర్శన..కౌంటింగ్ ఏర్పాట్ల పరిశిలించిన కలెక్టర్..

నిజామాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల పరిధిలో ఓట్ల లెక్కింపు పక్రియ కాసేపటిక్రితమే మొదలయింది. పోలీస్ శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటుచేసింది.నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి నగరంలోని పాలిటెక్నిక్ కళాశాలలో రెండు హాళ్లు లో లెక్కింపు జరుగుతుంది అభ్యర్థుల సమక్షంలోనే బ్యాలట్ బాక్స్ ల కు వేసిన సీల్ తొలగిస్తున్నారు. పోస్టల్ బ్యాలట్ లెక్కింపు పూర్తీ అయ్యాకే డివిజన్ ల బాక్స్ లు తెరుస్తారు రిటర్నింగ్ అధికారులు , కౌంటింగ్ సూపర్వైజర్లు, సహాయ సూపర్వైజర్ల సమక్షంలో ఈ పక్రియ జరుగుతుంది. కౌంటింగ్ హాలు లోనికి ఆర్.ఓ మినహా ఇతరులు ఎవరికీ సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతిఇవ్వలేదు, నిజామాబాద్ నగర పాలక సంస్థకు సంబంధించి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో, బోధన్ మున్సిపాలిటీ ఓట్లను బోధన్ పట్టణంలోని విజయ మేరీ హైస్కూల్ లో, ఆర్మూర్ మున్సిపల్ ఓట్లను ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, భీంగల్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ ను భీంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం స్ట్రాంగ్ రూమ్ ల నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లకు చేరుస్తూ, 8.00 గంటల నుండి అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలు పెట్టారు . . ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఇప్పటికే పలు విడతలుగా శిక్షణ తరగతులు నిర్వహించి పూర్తి అవగాహన కల్పించారు . ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద డివిజన్/వార్డు వివరాలను తెలిపేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు అత్యధికంగా 60 డివిజన్లు కలిగిన నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోని ఓట్ల లెక్కింపు కోసం పాలిటెక్నిక్ కళాశాలలో నాలుగు కౌంటింగ్ హాల్ లను ఏర్పాటు చేశామని వివరించారు. . ఒక్కో డివిజన్ కు ఒకటి చొప్పున 60 కౌంటింగ్ టేబుల్స్ ఏర్పాటు చేశామని, ఏకకాలంలో అన్ని డివిజన్ల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అయింది . బ్యాలెట్ బాక్సులను తెరిచి, పోలైన ఓట్లను 25చొప్పున బండిల్స్ గా విభజిస్తూ, ఒక్కో రౌండ్ లో వెయ్యి చొప్పున ఓట్లను లెక్కించేలా ఏర్పాట్లు చేసారు. బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీలలో కూడా ఇదే తరహాలో ఒక్కో వార్డుకు ఒకటి చొప్పున కౌంటింగ్ టేబుల్ లు ఉంటాయని అన్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో టేబుల్ కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్, ఇద్దరు కౌంటింగ్ అసిస్టెంట్లతో పాటు సపోర్టింగ్ స్టాఫ్ ను నియమించారు ఆయా మున్సిపాలిటీల పరిధిలో పోల్ అయిన ఓట్లను రౌండ్ల వారీగా లెక్కించేందుకు వీలుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల అనుసారం అదనపు సిబ్బందిని సైతం రిజర్వ్ లో ఉంచారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!