భారతీయ ధైర్యసాహసాలకు, స్వరాజ్య స్థాపనకు నిలువెత్తు నిదర్శనం ఛత్రపతి శివాజీ మహారాజ్ అని టీఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు మల్లని శివ మాదిగ కొనియాడారు. శివాజీ జయంతిని పురస్కరించుకుని గురువారం నిజామాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్లో ఆ సంఘం ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా శివాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొఘల్ సామ్రాజ్య విస్తరణను అడ్డుకుని, అణగారిన వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన మహావీరుడు శివాజీ అని పేర్కొన్నారు.
ఆయన పాలన కేవలం యుద్ధతంత్రానికే పరిమితం కాలేదని, ప్రజా సంక్షేమం, ధర్మ పరిరక్షణలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. నేటి యువత శివాజీ వీరత్వాన్ని, దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.
స్వరాజ్య ఆకాంక్షను రగిల్చిన శివాజీ మార్గంలో నడుస్తూ, ప్రజా శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు సంకల్పించారు.
ఈ కార్యక్రమంలో: ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు అఖిల్ మాదిగయువసేన నాయకులు పాలెం వంశీరాజ్బండారిపల్లి మల్లేష్ తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
