Saturday, April 18, 2026
HomeCRIMEడ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి వారం రోజుల శిక్ష..21 మందికి రూ. 2.10 లక్షల...

డ్రంక్ అండ్ డ్రైవ్ లో ముగ్గురికి వారం రోజుల శిక్ష..21 మందికి రూ. 2.10 లక్షల జరిమానా..

మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ముగ్గురికి కోర్టు వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు ట్రాఫిక్ సిఐ ప్రసాద్ తెలిపారు. ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు మంగళవారం ట్రాఫిక్ ఇన్స్‌పెక్టర్ పి. ప్రసాద్ ఆధ్వర్యంలో 24 మంది వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించారు.

అనంతరం వారిని సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ అహమ్మద్ మొయిద్దీన్ ఎదుట హాజరుపరిచారు. ఈ మేరకు 21 మందికి ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున మొత్తం రూ. 2,10,000 జరిమానా విధించారు. అలాగే, గొర్ల సతీష్, బూరె లింబద్రి, మహమ్మద్ ఖాసిం లకు వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.


మద్యం తాగి వాహనాలు నడిపి తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టవద్దని, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!