Saturday, April 18, 2026
HomeLaw and Orderహిందూ సమాజంపై దాడులను ఉపేక్షించే ప్రసక్తే లేదు..చర్యలు తీసుకోకుంటే జిల్లావ్యాప్త ఆందోళనలు: సిపికి వినతిపత్రం ఇచ్చిన...

హిందూ సమాజంపై దాడులను ఉపేక్షించే ప్రసక్తే లేదు..చర్యలు తీసుకోకుంటే జిల్లావ్యాప్త ఆందోళనలు: సిపికి వినతిపత్రం ఇచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు..

జిల్లాలో హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే జిల్లావ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు. బుధవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ఇందూరు జిల్లా పోలీస్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుస ఘటనలపై ఆందోళన
గత కొద్ది రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అమాయక ప్రజలపై జరుగుతున్న దాడుల పట్ల దినేష్ పటేల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాన్సువాడ, మోపాల్ మండల పరిధిలోని కాల్పోల్ గ్రామం.

రుద్రూర్, ఆనంద్ నగర్., ఇందూరు నగరంలోని మిర్చి కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో జరిగిన దాడులను ఆయన ప్రస్తావించారు. ఇంత జరుగుతున్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనలు జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు.

దాడులకు పాల్పడిన వారిని కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. పోలీసులు పక్షపాత రహితంగా వ్యవహరించి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ప్రతి సంఘటనపై స్పెషల్ టీమ్ (ప్రత్యేక బృందం) ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా సున్నిత ప్రాంతాల్లో పర్మనెంట్ సెక్యూరిటీ, పోలీసు పహారా పెంచాలని సూచించారు.

పోరాటం ఆగదు
బాధిత కుటుంబాలకు న్యాయం చేసి, వారికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వెంటనే స్పందించి నిందితులకు తగిన బుద్ధి చెప్పాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసనలు, ర్యాలీలు చేపడతామని హెచ్చరించారు. ధర్మ రక్షణ కోసం న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓం సింగ్, గోపిడి వినోద్ రెడ్డి, కృష్ణ, మారెడ్డి వనిత సురేష్, అమందు విజయ్ కృష్ణ, వినోద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

హిందూ సమాజంపై దాడులను ఉపేక్షించే ప్రసక్తే లేదు..

చర్యలు తీసుకోకుంటే జిల్లావ్యాప్త ఆందోళనలు:

సిపికి వినతిపత్రం ఇచ్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు..

జిల్లాలో హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోదని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకుంటే జిల్లావ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు. బుధవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి ఇందూరు జిల్లా పోలీస్ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరుస ఘటనలపై ఆందోళన
గత కొద్ది రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అమాయక ప్రజలపై జరుగుతున్న దాడుల పట్ల దినేష్ పటేల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బాన్సువాడ, మోపాల్ మండల పరిధిలోని కాల్పోల్ గ్రామం.

రుద్రూర్, ఆనంద్ నగర్., ఇందూరు నగరంలోని మిర్చి కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో జరిగిన దాడులను ఆయన ప్రస్తావించారు. ఇంత జరుగుతున్నా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం శోచనీయమన్నారు. ఈ ఘటనలు జిల్లాలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉన్నాయని మండిపడ్డారు. దాడులకు పాల్పడిన వారిని కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

పోలీసులు పక్షపాత రహితంగా వ్యవహరించి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలన్నారు. ప్రతి సంఘటనపై స్పెషల్ టీమ్ (ప్రత్యేక బృందం) ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా సున్నిత ప్రాంతాల్లో పర్మనెంట్ సెక్యూరిటీ, పోలీసు పహారా పెంచాలని సూచించారు.

పోరాటం ఆగదు
బాధిత కుటుంబాలకు న్యాయం చేసి, వారికి పూర్తి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వెంటనే స్పందించి నిందితులకు తగిన బుద్ధి చెప్పాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ నిరసనలు, ర్యాలీలు చేపడతామని హెచ్చరించారు. ధర్మ రక్షణ కోసం న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఓం సింగ్, గోపిడి వినోద్ రెడ్డి, కృష్ణ, మారెడ్డి వనిత సురేష్, అమందు విజయ్ కృష్ణ, వినోద్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!