జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఆదివారం కందర్‌పల్లి వద్ద డీబీఎల్ ప్రాంగణానికి చేరుకున్న సీఎంకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు స్వాగతం పలికారు.
అనంతరం వివాహ వేదిక వద్దకు వెళ్లిన సీఎం.. నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుక అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి బయటకు వచ్చి అక్కడికి తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేశారు.
అనంతరం అక్కడి నుంచి బయలుదేరారు. ఆయన వెంట టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సురేశ్ షెట్కార్ తదితరులు ఉన్నారు.
