HomeCRIMEఎలక్ట్రికల్‌ ఆటో బోల్తా.. యువకుడి మృతి

ఎలక్ట్రికల్‌ ఆటో బోల్తా.. యువకుడి మృతి

ఎలక్ట్రికల్‌ ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ ఘటనా డిచ్‌పల్లి మండలం నడిపల్లి వద్ద ఆదివారం చోటుచేసుకుంది.

బట్టు అంజి(25) తల్లి శోభతో కలిసి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. నడిపల్లి సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తాపడటంతో అంజికి తీవ్ర గాయాలయ్యాయి.

ప్రమాద తీవ్రతకు ఆయన అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments