HomeTelanganaNizamabadబతుకమ్మ సంబరాలు పోస్టర్ ఆవిష్కరణ:

బతుకమ్మ సంబరాలు పోస్టర్ ఆవిష్కరణ:

సంస్కార భారతి ఇందూరు జిల్లా మహానగర్ సమితి ఆధ్వర్యంలో నేడు బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరించారు. ఇందూరు జిల్లాలో ఈ నెల 10 తేది నుంచి 18వ తేది వరకు కలిసిమెలిసి ఆడుదాం మన సంస్కృతి చాటుదాం అని నినాదంతో కార్యక్రమం ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత మంచ్ కళ సంయోజక్ బెజుగం శ్రీనివాస్ బతుకమ్మ సంబరాల పోస్టర్ ను శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం బోర్గం లో ఆవిష్కరించారు.

ఇందూరు జిల్లాలో వివిధ 10 ప్రాంతాలలో ఈ బతుకమ్మ సంబరాలు నిర్వహించాలని పల్లెటూర్లలో కూడా బతుకమ్మ కార్యకమాన్ని నిర్వహించి మహిళలకు ఉత్తమ బతుకమ్మ బహుమతి, ఉత్తమ బతుకమ్మ పాట బహుమతి ఆటలు పాటలు చిరస్థాయిగా తరతరాలకు నిలిచి ఉండేలా ప్రోత్సహించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రాజకుమార్ సుబేదార్ , ప్రధాన కార్యదర్శి సముద్రాల మాధురి, మాతృ శక్తి కన్వీనర్ వరలక్ష్మి , నాగుర్తి శంకర్ , ఉపాధ్యక్షులు కెవి రమణాచారి , ప్రచార్ ప్రముఖ్ బెజగం శ్రీకాంత్, సాయ రెడ్డి, అవన్ కుమార్, సీనియర్ కార్యకర్త రామ శేషు , నాగనాథ్ గుత్ప, శ్రీలత , తులసి రజిత , ఎం శశిరేఖ పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments