HomePOLITICAL NEWSNationalఢిల్లీ లిక్కర్ కేసు ను కొట్టేసిన కోర్టు ……కవిత కు క్లిన్ చిట్

ఢిల్లీ లిక్కర్ కేసు ను కొట్టేసిన కోర్టు ……కవిత కు క్లిన్ చిట్

ఢిల్లీ మద్యం విధానం కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సీబీఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టివేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది . కవితపై సీబీఐ మోపిన ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది.


కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుబ్చిబాబు, అప్పటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాతో సహా మరో 20 మంది తప్పు చేశారని చెప్పడానికి సీబీఐ ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు చూపలేక పోయిందని , చార్జ్‌షీట్‌లో నూ అనేక లోపాలను కోర్టు ఎత్తిచూపింది . సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు.

రెండేళ్లకు పైగా సాగిన ఈ కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి దాదాపు అయిదు నెలలు తీహార్ జైలు లో ఉన్నారు బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా, కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టివేయడంతో కవితకుభారీ ఊరట దక్కింది ఆమె తెలంగాణ లో త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు కు సిద్ధం అవుతున్న నేపథ్యంలో కోర్టు తీర్పు ఆమె తదుపరి రాజకీయ ప్రస్థానానికి బలం ఇచ్చింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments