HomeCRIMEఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ హతం

ఇరాన్ సుప్రీం కమాండర్ ఖమేనీ హతం

శనివారం ఆయన నివాసం ఆఫీస్ లను లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయిల్ జరిపిన క్షిపణీ దాడుల్లో ఖమేనీ హతం అయ్యారు. ఆయన మృతి ని ఇరాన్ అధికార మీడియా ద్రువీకరించింది. టెహ్రాన్‍లోని ఆఫీసులో ఖమేనీ ఉన్నట్లు యూఎస్, ఇజ్రాయెల్ నిర్థారణకు వచ్చాయి.

శాటిలైట్ ద్వారా ఖమేనీ లొకేశన్ గుర్తించిన 15 నిమిషాల్లోనే మిసైళ్లతో విరుచుకుపడినట్లు తెలుస్తోంది. తొమహాక్ మిస్సైళ్లతో అమెరికా దాడులకు దిగితే ప్రెసిషన్ గైడెడ్ మిస్సైళ్లతో ఇజ్రాయెల్ దాడులకు దిగింది.

ఖమేనీ కాంపౌండ్ పై కనీసం 7 మిస్సైళ్లతో దాడులు జరిపినట్లు తెలిసింది. శనివారం అమెరికా ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ'(Operation Epic Fury), ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ లయన్ రోర్’ (Roaring Lion) పేరుతో జరిపిన దాడులు ఇరాన్ మిలటరీ స్థావరాలు మరియు అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నాయనేట్లు పైకి కనిపించాయి.

కానీ ‘ఆపరేషన్ కిల్ ఖమేని’ పేరుతో శనివారం తెల్లవారుజామున 1:15 గంటలకు ఇరాన్‍పై మిస్సైల్స్ తో రెండు దేశాలు ఏకకాలంలో దాడులకు తెగబడ్డాయి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments