కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కాగార్ చివరికి అంకానికి చేరింది. ఇటీవలే అయిదుగురు అగ్రతా నేతలు తెలంగాణ పోలీసులు లొంగిపోగా దానికి కొనసాగింపుగా మరో భారీ లొంగుబాటు కు రంగం సిద్ధం అయింది.
ఈసారి తెలుగు రాష్ట్రాల చరిత్ర లోనే మొదటి సారిగాఈసారి లొంగుబాటులు ఏకంగా తెలంగాణ సీఎం సమక్షంలోనే జరగనున్నాయి. ఈమేరకు కేంద్రం హోం శాఖ మంత్రి నుంచి తెలంగాణ సర్కార్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.
మావోయిస్టు పార్టీ మాజీ దళపతి, అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియాస్ గణపతి శనివారం సీఎం రేవంత్ రెడ్డి ఎదుట లొంగిపోనున్నట్లు తెలుస్తోంది.
ఆయనతో పాటు మరో 124 మంది వివిధ స్థాయిలకు చెందిన మావోయిస్టు నాయకులు, కమాండర్లు, సభ్యులు కూడా లొంగిపోనున్నారు. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనేత దేవ్జీకి చెందిన పీఎల్జీఏ విభాగానికి చెందిన వారు కూడా ఉండటం గమనార్హం.
ఈ క్రమంలో మావోయిస్టుల లొంగుబాటుపై స్వయంగా ముఖ్యమంత్రి ప్రెస్మీట్ నిర్వహిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ పోలీసులు గత కొంతకాలంగా మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలను ఇస్తున్నాయి.
ఇంత పెద్ద సంఖ్యలో అగ్రనేతలతో సహాఏకంగా 120 మంది నక్సల్స్ లొంగిపోవడం రాష్ట్ర చరిత్రలో మొదటి సారి కావడం విశేషం. ఛత్తీస్ ఘడ్ మహారాష్ట్ర ల్లో మొదలైన లొంగుబాటు లకు తెలంగాణ పోలీస్ ఫైనల్ టచ్ ఇవ్వనున్నారు
