HomePOLITICAL NEWSNationalటీ20 వరల్డ్ కప్ 2026 సాధించిన సూర్య సేనకు శుభాకాంక్షలు:టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్...

టీ20 వరల్డ్ కప్ 2026 సాధించిన సూర్య సేనకు శుభాకాంక్షలు:టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు

టీ20 వరల్డ్ కప్ 2026ను గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని భారత జట్టుకు టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ క్రికెట్ వేదికపై భారత జట్టు అద్భుత ప్రతిభను కనబరిచి టైటిల్‌ను కైవసం చేసుకోవడం దేశ ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు.

టోర్నమెంట్ మొత్తం భారత జట్టు సమిష్టి కృషి, పట్టుదల, అద్భుత ఆటతీరుతో అభిమానులను అలరించిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సమర్థ నాయకత్వం, ఆటగాళ్ల సమన్వయం ఈ విజయానికి ప్రధాన కారణమని మహేష్ కుమార్ గౌడ్ గారు అభినందించారు.

న్యూజిలాండ్ పై ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ప్రదర్శించిన అద్భుతమైన ఆటతీరు భారత క్రికెట్ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు.

ఈ విజయం యువతకు స్ఫూర్తినిచ్చేదిగా నిలుస్తుందని, క్రీడల్లో కృషి, క్రమశిక్షణ, జట్టు భావన ఉంటే ప్రపంచ స్థాయిలో విజయాలు సాధించవచ్చని ఈ జట్టు నిరూపించిందని తెలిపారు. దేశం కోసం పోరాడిన ప్రతి ఆటగాడికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

భారత క్రికెట్ జట్టు భవిష్యత్తులో కూడా ఇదే విధంగా విజయాల పరంపర కొనసాగిస్తూ దేశ ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆకాంక్షిస్తూ, ఆటగాళ్లందరికీ మరింత విజయాలు సాధించాలని మహేష్ కుమార్ గౌడ్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments