సిద్దిపేట ఎమ్మెల్యే, రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకి నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా గణేష్ బిగాల మాట్లాడుతూ… నిరంతరం ప్రజల కోసం పరితపించే నాయకుడిగా, ప్రజా సమస్యల పరిష్కారంలో తనదైన ముద్ర వేసిన హరీష్ రావు కలకాలం ఆరోగ్యంగా, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ప్రజాసేవలో ఆయన మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు.
