శాసన సభలో అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా..ఇందూరు: రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించి నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాలని నిజామాబాద్ కార్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గురువారం ఐటీ, మున్సిపల్ అంశాలపై మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఇందూరు లో నిర్మించిన ఐటీ హబ్ నిరాదరణకు గురవుతుందన్నారు. సుమారు 45 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్ లో 23 కంపెనీలు ఉండాల్సింది కేవలం 10 మాత్రమే పనిచేస్తున్నాయన్నారు అవి కూడా ఎమ్ఎన్సీ కంపెనీలు కాకుండా స్టార్టప్, బీపీవో ఉన్నాయన్నారు.
ప్రధానంగా డిగ్రీలు, పీజీలు చేసిన వేలాది మంది నిరుద్యోగ యువత గల్ఫ్ బాట పట్టే పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే స్థానిక యువత హైదరాబాద్ లో తక్కువ వేతనాలకు ఉద్యోగాలు చేసి ఇబ్బందులకు గురవుతున్నారని, అదే సొంత నగరాల్లో ఐటీ ఉద్యోగాలు కల్పిస్తే వారికి ఆసరాగా ఉండే అవకాశం ఉంటుందన్నారు.
నిజామాబాద్ లో ఉన్న రామర్తి చెరువు, బొందెం చెరువు, పులాంగ్ వాగు సగానికి పైగా కబ్జా కి గురవుతుందని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అలాగే జిల్లా కేంద్రంలో రెండు చోట్ల ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటు చేయాలని, ఫుట్ పాత్ కబ్జాలపై దృష్టి సారించాలన్నారు.
మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే కబ్జాలను అరికట్టే అవకాశం ఉంటుందన్నారు. అలాగే నగర సుందరీకరణ కూడా ఏర్పడుతుందన్నారు.
