HomeTelanganaNizamabadఏప్రిల్ 1 న బిఎస్పి నిజామాబాద్ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం

ఏప్రిల్ 1 న బిఎస్పి నిజామాబాద్ పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశం

బహుజన్ సమాజ్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ విశ్వతస్థాయి సమావేశం ఏప్రిల్ 1వ తేదీ నిర్వహిస్తున్నట్లు నిజామాబాద్ పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ నీరడి లక్ష్మణ్ ఆదివారం ప్రకటన విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నిర్మాణం దృష్టిలో ఉంచుకొని విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కపిల హోటల్ లో మధ్యాహ్నం ఒకటి గంటలకు విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.

ఈ సమావేశానికి నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న రెండు జిల్లా కమిటీలు, అన్ని నియోజకవర్గ కమిటీలు, ముఖ్య నాయకులు,ముఖ్య కార్యకర్తలు, ప్రతి ఒక్కరూ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ జోన్ ఇంచార్జ్ అడ్వకేట్ నిశాని రామచంద్రం, అతిథులుగా జోన్ ఇన్చార్జి ఎనుగొందుల వెంకన్న హాజరవుతున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments