Monday, April 20, 2026
HomeTelanganaNizamabadప్రముఖులకు సన్మానించిన రోటరీ క్లబ్ సభ్యులు

ప్రముఖులకు సన్మానించిన రోటరీ క్లబ్ సభ్యులు

పల్నాడు జిల్లా నరసరావుపేట స్థానిక వినుకొండ రోడ్ లో ఉన్న రోటరీ భవనంలో ఆది,సోమవారాల్లో ప్రముఖులకు ఘనంగా సత్కరించి మెమొంటోతో సన్మానించారు. (ICAI) ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వారు 2026-27 సంవత్సరానికి నేషనల్ రీసెర్చ్ కమిటీ మెంబర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఎంపికైన రొటేరియన్, చార్టెడ్ అకౌంటెంట్ చేకూరి సాంబశివరావుకు రావడం జరిగిందని, మరియు రోటరీ ఇంటర్నేషనల్ 3150,2025-26సంవత్సరం రోటరీ వుమెన్, న్యాయవాది రొటీరియన్ చీమకుర్తి నాగలక్ష్మి సునీత (W/O పొత్తూరి శివనాగరాజు)కు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుండి కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 2025-26 సంవత్సరం డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (Ph.D.)పట్టా పొందారని, ఆమె భారతదేశంలో మ్యూచువల్ ఫండ్స్ పథకాల పనితీరు విశ్లేషణ అనే అంశం పై పరిశోధన చేశారని.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చేకూరి సాంబశివరావు, చీమకుర్తి నాగలక్ష్మి సునీత వారికి వ్యక్తిగత మైలురాళ్లు మాత్రమే కాకుండా,నరసరావుపేట రోటరీ క్లబ్ కు, పల్నాడు జిల్లాకే గర్వకారణమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రెటరీ అండ్ కరెస్పాండెంట్, నరసరావుపేట రోటరీ క్లబ్ అధ్యక్షులు షేక్ కరీం మొహిద్దిన్,సెక్రటరీ భవనం మునీందర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ పొత్తూరి శివనాగరాజు రోటరీ ఇంటర్నేషనల్ త్రీ వన్ ఫైవ్ జీరో పాస్ట్ గవర్నర్లు కేపీ రంగారావు, తాళ్ల రాజశేఖర్ రెడ్డి,రోటరీ క్లబ్ డైరెక్టర్లు ఎస్.కె.జిలానీ మాలిక్,మేళ్లచెరువు సుమిత్ర కుమార్,జమ్ముల రాధాకృష్ణ,మామిడి సుబ్బారావు, కపలవాయి రమేష్ చంద్ర దత్తు, కపలవాయి రాజేంద్రప్రసాద్, కాకుమాను రాఘవరావు, మురారి శెట్టి వెంకటేశ్వరరావు, పోటు అచ్యుత్, కొత్తూరి వెంకట ఆంజనేయులు, లింగ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!