ఇరాన్ అమెరికా యుద్ధం తో తలెత్తిన గ్యాస్ సంక్షోభం మరింత ముదురుతోంది. ఎడాపెడా గ్యాస్ ధరలను పెంచుతూ ….గ్యాస్ బుకింగ్ ల్లో ఆంక్షలు అమల్లోకి తెచ్చిన సర్కార్ గ్యాస్ కొరత ను అధిగమించలేక పోతుంది.
గ్యాస్ సిలెండర్ లకోసం ప్రజానీకం ఏజెన్సీ లు తెరవక ముందే బారులు తీరుతున్నారు.
సిలెండర్ లు ఆన్ లైన్ లో బుక్ చేకున్నా సరే సిలెండర్ దొరక్క ప్రజానీకం రోజుల తరబడిగా ఏజెన్సీలకు చక్కర్లు కొడుతున్నారు
జిల్లా సివిల్ సప్లై అధికారి రెండు రోజుల క్రితమే ఆయా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులతో భేటీ అయ్యారు ఏజెన్సీ ల వద్ద ప్రజలు క్యూ లు కట్టకుండా ఎప్పటికప్పుడు సప్లై చెయ్యాలని స్పష్టం చేసారు
మరో వైపు జిల్లా కలెక్టర్ సైతం ఇటీవలే భారత్ గ్యాస్ ఏజెన్సీ ను తనిఖీ చేసారు అయినప్పటికి నగరంలో గ్యాస్ కొరత ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది నగరంలోని తిలక్గార్డెన్ చౌరస్తా వద్ద ఓ గ్యాస్ ఏజెన్సీ ఎదుట బుధవారం ఉదయం వినియోగదారులు ధర్నా చేపట్టారు.
ఉదయాన్నే గ్యాస్ ఏజెన్సీకి వచ్చిన తమకు సిలిండర్ల లేవని నిర్వాహకులు సమాధానం ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డొమెస్టిక్ సిలిండర్లను వ్యాపారస్తులకు గుట్టుచప్పుడు కాకుండా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని వారు ఆరోపించారు. నడిరోడ్డుపై గ్యాస్ వినియోగదారులు ధర్నా చేపట్టడంతో కొద్దిసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
