శ్రీ వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి నిజామాబాద్ నగర ఆర్యవైశ్యులు ఘనంగా ధన్యవాదాలు తెలియజేశారు. గురువారం నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, త్యాగానికి ప్రతిరూపమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ మహోన్నత నిర్ణయం ఆర్యవైశ్య సమాజానికే గర్వకారణమని కొనియాడారు. కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు అమ్మవారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ప్రతి ఆర్యవైశ్యుడు గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఈ నిర్ణయ సాధనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలతో తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పాల్త రవికుమార్ గుప్త, కసుబ సంపత్ కుమార్ గుప్త, కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు మరియు నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
త్యాగానికి దక్కిన గౌరవంముఖ్యమంత్రికి ఆర్యవైశ్యుల కృతజ్ఞతాభివందనంశ్రీ వాసవి మాత జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రభుత్వానికి నిజామాబాద్ నగర ఆర్యవైశ్యులు ఘనంగా ధన్యవాదాలు తెలియజేశారు.
గురువారం నగరంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, త్యాగానికి ప్రతిరూపమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ మహోన్నత నిర్ణయం ఆర్యవైశ్య సమాజానికే గర్వకారణమని కొనియాడారు.
కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు అమ్మవారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ప్రతి ఆర్యవైశ్యుడు గర్వించదగ్గ విషయమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ.. ఈ నిర్ణయ సాధనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
అమ్మవారి కృపాకటాక్షాలతో తెలంగాణ రాష్ట్రం మరింత సుభిక్షంగా, అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పాల్త రవికుమార్ గుప్త, కసుబ సంపత్ కుమార్ గుప్త, కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ సభ్యులు మరియు నిజామాబాద్ పట్టణ ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
