HomeDevotionalఅయ్యప్ప ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా ... అయ్యప్ప జన్మ దినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్...

అయ్యప్ప ఆశీర్వాదంతోనే ఈ స్థాయికి ఎదిగా … అయ్యప్ప జన్మ దినోత్సవంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త

ఇందూరు: అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతోనే తాను ఎమ్మెల్యేగా ఎదిగానని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు.

అయ్యప్ప జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం నగరంలోని అయ్యప్ప ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్ పాల్ మాట్లాడుతూ.. ఇందూరు అయ్యప్ప ఎంతో మహిమాన్ముతుడని, కొలిచిన వారికి అండగా నిలుస్తాడని తెలిపారు.

జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చేసిన అలంకరణ ఎంతో ఆకట్టుకుందన్నారు. మండల పూజ సమయంలో నగరంలోని అనేక పడి పూజలకు హాజరవుతానని, అది ఎంతో సంతృప్తినిస్తుందన్నారు. అయ్యప్పను నమ్మినవారికి కొండంత అండగా నిలుస్తాడని పేర్కొన్నారు. యువత ఆధ్యాత్మికం వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

అలాగే గురువారం జరిగే హనుమాన్ శోభాయాత్ర కు భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావాలని పిలుపునిచ్చారు. అనంతరం భజన బృందాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన పూజారి రమేష్ గురుస్వామి, గుండయ్య స్వామి, భక్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments