మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామంలోఅనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు ను పట్టుకొని అక్రమ ఇసుక రవాణాపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఎనిమిది ట్రిప్పుల ఇసుక డంపును గుర్తించి, రెండు ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్కు అప్పగించి కేసు నమోదు చేసినట్లు తహసిల్దార్ మల్లయ్య తెలిపారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుత మంగళవారం రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో అక్రమ ఇసుక రవాణా అరికట్టడంలో భాగంగా మండల రెవెన్యూ పరిశీలకులు, గ్రామ రెవెన్యూ సహాయకులు గస్తీ నిర్వహించగా ప్యాక్స్ గోదాం ప్రాంతంలో అక్రమంగా నిల్వచేసిన ఎనిమిది ట్రిప్పుల ఇసుక డంపును గుర్తించినట్లు తెలిపారు.
అనంతరం గ్రామంలోని వాగు వద్ద బ్రిడ్జి క్రింద ఇసుక లోడుతో ఉన్న రెండు ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేసి తదుపరి చర్యల నిమిత్తం పోలీస్ స్టేషన్కు అప్పగించినట్లు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని ఈ సందర్బంగా తహసిల్దార్ హెచ్చరించారు.
