ఎల్లారెడ్డి. ఎయిర్ కూలర్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్ ఘాతానికి గురై మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి (47) అనే వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం రాజిరెడ్డి తన ఇంట్లో ఎయిర్ కూలర్ మరమ్మత్తులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ సరఫరా అయింది.
దీంతో తీవ్ర విద్యుత్ ఘాతానికి గురై రాజిరెడ్డి అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు వారు పేర్కొన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే రాజిరెడ్డి మృతి చెందడంపై గ్రామంలో విషాద ఛాయలు అల్ముకున్నాయి..
