రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆబ్కారీ సిఐ ని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు శుక్రవారం ఉదయం అరెస్టు చేసారు .
కామారెడ్డి జిల్లా బిచ్కుంద సీఐ సత్యనారాయణ ఓ కేసులో నిందితుడి ని భారీఎత్తున నగదు డిమాండ్ చేసారు.
దీనితో బాదితుడు నేరుగా ఏసీబీ అధికారులను ఆశ్రయించారు ముందే వేసుకున్న ఫ్లాన్ మేరకు శుక్రవారం బాధితుడు సీఐ కి రెండు లక్షల నగదు ఇస్తుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.
తనిఖీలు పూర్తయిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు
