HomeCRIMEనిప్పంటినుకున్న ఆర్ టిసి డ్రైవర్

నిప్పంటినుకున్న ఆర్ టిసి డ్రైవర్

వరంగల్ జిల్లాలో నర్సంపేట్ డిపో కు చెందిన ఆర్టీసీ డ్రైవర్ ఒంటిమీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించున్నాడు . ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోవడం లేదని మనస్తాపానికి గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది.

నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తన్న శంకర్ గౌడ్, ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. “ప్రభుత్వం తక్షణమే ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి” అంటూ నినదిస్తూ, వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకుని నిప్పు అంటించుకున్నాడు .

అడ్డుకున్న తోటి సిబ్బంది:శంకర్ గౌడ్ ఆకస్మిక చర్యతో ఒక్కసారిగా తోటి కార్మికులు, ప్రయాణికులు షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సహచర కార్మికులు ఆయనను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది.

అయితే, అప్పటికే స్వల్పంగా అస్వస్థతకు గురైన శంకర్ గౌడ్‌ను ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించారు.కార్మిక సంఘాల ఆగ్రహం:ఈ ఘటనపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్రంగా స్పందించాయి.

“కార్మికులు ప్రాణత్యాగాలకు సిద్ధపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం” అని వారు మండిపడుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments