జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) ఇన్స్పెక్టర్ పి. శ్రీశైలం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా పదోన్నతి పొందారు. రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు ఈ పదోన్నతుల ప్రక్రియ పూర్తయింది.
ఈ సందర్భంగా శనివారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను ఆయన కార్యాలయంలో శ్రీశైలం మర్యాదపూర్వకంగా కలిశారు. పదోన్నతి పొందిన ఏసీపీ శ్రీశైలంకు సీపీ సాయి చైతన్య పుష్పగుచ్ఛం అందజేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
నూతన బాధ్యతల్లో మరింత సమర్థవంతంగా పనిచేసి శాఖకు మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా సీపీ ఆకాంక్షించారు. గత కొంతకాలంగా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, ఏసీపీగా బాధ్యతలు పెరగడం పట్ల శ్రీశైలం హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
