నిజామాబాద్, ఏప్రిల్ 25 : నిజామాబాద్ జిల్లా నూతన మీడియా అక్రిడేషన్ కమిటీ సభ్యులు శనివారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో శనివారం ఆయన ఛాంబర్లో భేటీ అయ్యారు. జిల్లా డీఎంఏసీ సభ్యులను పరిచయం చేసుకుని, వారికి సభ్యత్వ పత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓకు అనుగుణంగా అర్హులైన వారికి అక్రిడిటేషన్ కార్డులు జారీ అయ్యేలా కృషి చేయాలని సూచించారు. ఈ విషయంలో కమిటీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, పారదర్శకంగా ఈ ప్రక్రియ జరిగేలా చూడాలన్నారు.
త్వరలోనే కలెక్టర్ అధ్యక్షతన జిల్లా మీడియా ఆక్రిడిటేషన్ కమిటీ సమావేశం నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంలో డీపీఆర్ఓ ఎన్.పద్మశ్రీ, డీఎంఏసీ సభ్యులు ఏ.నర్సింలు, ఆర్.భూపతి, జి. సాయి ప్రసాద్, సీ.హెచ్.జాన్సన్, ఎంఏ. మాజిద్, కే.రాందయానంద్, ఎండీ.గౌస్, ఎల్. బాల్ కుమార్, ఎస్. శ్రీకాంత్, ఎన్.శ్రీనివాస్ పాల్గొన్నారు.
