HomeTelanganakamareddyమంత్రి సీతక్కను కలిసిన కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

మంత్రి సీతక్కను కలిసిన కామారెడ్డి డీసీసీ ఉపాధ్యక్షులు గంప ప్రసాద్

కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కమిటీ (డీసీసీ) ఉపాధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన నాయకులు గంప ప్రసాద్ బుధవారం రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి డా.ధనసరి అనసూయ (సీతక్క)ను మర్యాదపూర్వకంగా కలిశారు.

జిల్లా కేంద్రంలో మంత్రిని కలిసిన వారు.. తమకు ఈ కీలక బాధ్యతను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ సందర్భంగా గంప ప్రసాద్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ పదవిని అప్పగించిన ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్, కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఏలే మల్లికార్జునకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి సీతక్క వారిని అభినందిస్తూ.. జిల్లాలో పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుగ్గా పాలుపంచుకోవాలని సూచించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments