సమావేశంనిజామాబాద్ నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ట్రాఫిక్ సీఐ ప్రసాద్ సూచించారు. సోమవారం నిజామాబాద్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో వివిధ ఆటో యూనియన్ల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆటోలను ఇష్టానుసారంగా నిలిపి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడి ఆటోలు నడపడం ద్వారా ప్రయాణికులు, ఇతర వాహనదారులకు ఇబ్బందులు కలిగించవద్దన్నారు.
నగరంలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పోలీసులతోపాటు ఆటో డ్రైవర్లు, వాహనదారులు, ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం ఆటో డ్రైవర్లతో సీఐ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నిబంధనల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను యూనియన్ ప్రతినిధులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
