నిజామాబాద్ నగరంలోని ఒకటో డివిజన్ పరిధి గౌడ్ కాలనీలో ఆదివారం ఎల్లమ్మ తల్లి బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచే కాలనీలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. కన్నపురం దుర్గా గౌడ్, నిజాంపేట్ బాలా గౌడ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.
ఇంటింటి నుంచి మహిళలు బోనాలను తీసుకుని భక్తిశ్రద్ధలతో రెండో నంబర్ కల్లు డిపోలోని ఎల్లమ్మ దేవాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
ఎల్లమ్మ తల్లి కరుణాకటాక్షాలతో నిజామాబాద్ నగరవాసులంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని భక్తులు ప్రార్థించారు. అమ్మవారికి బోనాలు సమర్పించే సమయంలో భక్తుల భక్తి భావం వెల్లివిరిసింది.
ఎల్లమ్మ తల్లి నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. పండుగ సందర్భంగా కాలనీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు.
ఈ కార్యక్రమంలో జంగం అంజాగౌడ్,రాజేశ్వర్ గౌడ్,బాషాగౌడ్,కన్నపురం శ్యామల, చిట్టపురం యాదమ్మ, సుగుణ, తుజల్పూర్ లలిత, సుజాత, లత, స్వప్న, పోతిరెడ్డి లక్ష్మి, వాణి, భవాని, భాగ్య, పావని, శోభ, తదితరులు పాల్గొన్నారు.
